శ్రీశైలం ఉపాలయాల్లో ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:06 AM
శ్రీశైల మహాక్షేత్రంలో ప్రధాన దేవాలయానికి ఉపాలయాలుగా ఉండే ఘంటామఠం, భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధార పంచమఠాలలో కొలువైన్న పురాతన శివలింగాలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
g వెండి రథంపై ఆదిదంపతుల ఊరేగింపు
శ్రీశైలం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైల మహాక్షేత్రంలో ప్రధాన దేవాలయానికి ఉపాలయాలుగా ఉండే ఘంటామఠం, భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధార పంచమఠాలలో కొలువైన్న పురాతన శివలింగాలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సోమవారం సాయంత్రం ప్రధాన ఆలయానికి కుడి వైపు ఉన్న పురాతన రాతిమండపంలో స్వామిఅమ్మవార్లను ఊయలలో ఆశీనులచేసి షోడశోపచార పూజలు నిర్వహించారు. అర్చక వేదపండితులు సహస్ర దీపాలను వెలిగించారు. అనంతరం వెండి రథంలో ఆశీనులైన స్వామిఅమ్మవార్లకు పుష్పార్చనలు చేసి ఆలయ ప్రదక్షిణలు చేశారు. దర్శనార్థం వచ్చిన వివిధ ప్రాంతాల భక్తులు రథోత్సవంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.