Share News

Excess Charges: ప్రైవేట్‌ బస్సుల్లో ఉల్లంఘనలపై స్పెషల్‌ డ్రైవ్‌

ABN , Publish Date - Jan 15 , 2026 | 03:50 AM

సంక్రాంతి సందర్భంగా ప్రైవేట్‌ బస్సులపై ప్రజా రవాణా సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టింది. ట్యాక్స్‌లు ఉల్లంఘన, అనుమతులు లేకపోవటంతో పాటు అధిక చార్జీలు వసూలు...

Excess Charges: ప్రైవేట్‌ బస్సుల్లో ఉల్లంఘనలపై స్పెషల్‌ డ్రైవ్‌

  • నిబంధనల అతిక్రమణ, అధిక చార్జీలపై 850 కేసులు

  • ఆరు రోజుల్లో 41.77 లక్షల జరిమానా వసూలు

విజయవాడ (బస్‌స్టేషన్‌), జనవరి 14 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సందర్భంగా ప్రైవేట్‌ బస్సులపై ప్రజా రవాణా సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టింది. ట్యాక్స్‌లు ఉల్లంఘన, అనుమతులు లేకపోవటంతో పాటు అధిక చార్జీలు వసూలు చేసిన కాంట్రాక్టు క్యారేజీ బస్సుల యజమానుల నుంచి రాబట్టిన కాంపౌండ్‌ ఫీజు వివరాలను బుధవారం ఆర్టీసీ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈనెల 9 నుంచి 14వ తేదీ (బుధవారం) వరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఆ బస్సుల ఉల్లంఘనలకు సంబంధించి 850 కేసులు నమోదు చేసి రూ. 41,77,280 జరిమానా వసూలు చేశారు. అధిక చార్జీల విషయంలో 265 కేసులు నమోదు చేసి రూ. 26,25,250 ఫైన్‌ వేశారు. ఈ కేసులు అత్యధికంగా పశ్చిమ గోదావరి జిలా (59) నమోదయ్యాయి. పన్నులు, అనుమతులకు సంబంధించి 41 కేసులు పెట్టారు. ఇక అనుమతులు, పన్నుల చెల్లింపు తదితర అంశాల కేసు ల్లో ఎన్టీఆర్‌ జిల్లా టాప్‌లో ఉంది. ఇక్కడ 92 కేసులు నమోదు చేసి రూ. 3,63,659 జరిమానా వసూలు చేశారు. అధిక చార్జీల విషయంలో కేవలం రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి. కాగా, బుధవారం ఒక్కరోజే అన్ని జిల్లాల్లో అ ధిక చార్జీలకు వసూలుకు సంబంధించి 50 కేసులు నమోదు కాగా, కాంపౌండు ఫీజు కింద రూ.4,61,200 వసూలు చేశారు. అనుమతులు, పన్నుల చెల్లింపు విషయాలకు సంబంధించి అన్ని జిల్లాల్లో కలిపి 134 కేసులు నమోదు చేశారు. కాం పౌండు ఫీజు కింద రూ. 3,79,300 వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - Jan 15 , 2026 | 03:54 AM