Share News

పోలవరంలో ప్రత్యేక సీఎస్‌

ABN , Publish Date - May 23 , 2026 | 06:01 AM

రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ శుక్రవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.

పోలవరంలో ప్రత్యేక సీఎస్‌

  • ప్రాజెక్టు పనులు పరిశీలించిన శశిభూషణ్‌

పోలవరం, మే 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ శుక్రవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ శాఖ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన ప్రాజెక్టు పరిశీలనకు రావడం ఇదే తొలిసారి. గురువారం రాత్రికే ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఆయన.. ప్రాజెక్టు అతిథి కార్యాలయంలో బస చేసి శుక్రవాయం ఉదయాన్నే నిర్మాణాల పరిశీలన ప్రారంభించారు. స్పిల్‌వే, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలు, డయాఫ్రంవాల్‌, ఫిష్‌ల్యాడర్‌ ప్రాంతాలను.. ప్రస్తుతం జరుగుతున్న ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం, జల విద్యుత్‌ కేంద్రం పనులను పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్లను పరిశీలించారు. శశిభూషణ్‌ వెంట పీపీఏ సీఈవో సంజీవ్‌ వోహ్రా, సీఈ కె.రమేశ్‌బాబు, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ కె.నరసింహమూర్తి, మేఘా సీజీఎం గంగాధర్‌, డీజీఎం మురళి పమ్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2026 | 06:02 AM