Share News

వేసవి డిమాండ్‌ను సమర్థంగా ఎదుర్కొందాం

ABN , Publish Date - Mar 10 , 2026 | 06:00 AM

వేసవి విద్యుత్‌ డిమాండ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు విద్యుత్‌ సంస్థలు సిద్ధమవ్వాలని విద్యుత్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఆదేశించారు.

వేసవి డిమాండ్‌ను సమర్థంగా ఎదుర్కొందాం

  • విద్యుత్‌ సమీక్షలో ప్రత్యేక సీఎస్‌ విజయానంద్‌ పిలుపు

అమరావతి, మార్చి 9(ఆంధ్రజ్యోతి): వేసవి విద్యుత్‌ డిమాండ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు విద్యుత్‌ సంస్థలు సిద్ధమవ్వాలని విద్యుత్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఆదేశించారు. విద్యుత్‌ సరఫరా, డిమాండ్‌పై సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విద్యుత్‌ డిమాండ్‌ ఈ ఏడాది మేలో రోజుకు 280 మిలియన్‌ యూనిట్ల వరకు పెరిగే అవకాశం ఉందని, ప్రస్తుతం రోజుకు సగటున 264.65 మిలియన్‌ యూనిట్లు ఉందన్నారు. ఈ సీజన్‌లో మార్చి 7న గరిష్ఠంగా 274.6 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం నమోదైందన్నారు. సమీక్షలో జెన్కో ఎండీ పుల్లారెడ్డి, ట్రాన్స్‌కో డైరెక్టర్‌ ఏకేవీ భాస్కర్‌, డిస్కంల చైర్మన్లు శివశంకర్‌, పృథ్వీతేజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 10 , 2026 | 06:01 AM