Share News

ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలి: స్పీకర్‌ అయ్యన్న

ABN , Publish Date - Jan 20 , 2026 | 05:04 AM

తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకు కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’ ప్రకటించి గౌరవించాలి అని స్పీకర్‌...

ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలి: స్పీకర్‌ అయ్యన్న

నర్సీపట్నం, జనవరి 19(ఆంధ్రజ్యోతి): తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకు కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’ ప్రకటించి గౌరవించాలి అని స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. ఎన్టీఆర్‌ 30వ వర్ధంతిని పురస్కరించుకుని సౌదీ అరేబియా, ఉక్రెయిన్‌, బహ్రెయిన్‌, కువైట్‌ దేశాల్లో ఉంటున్న తెలుగువారి ఆహ్వానం మేరకు ఆయన మంగళవారం జూమ్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌తో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని, మధుర జ్ఞాపకాలను వారితో పంచుకున్నారు. పేదవారి కోసం ఆయన అమలుచేసిన సంక్షేమ పథకాలను గుర్తుచేశారు. మే 8న ఉక్రెయిన్‌లో జరిగే శ్రీనివాస కల్యాణ ఉత్సవానికి హాజరుకావాలని నిర్వాహకులు స్పీకర్‌ను కోరారు. ఉక్రెయిన్‌ నుంచి రఘుబాబు, హరిబాబు, సతీష్‌శెట్టి, కువైట్‌ నుంచి వెంకట్‌ కోడూరి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 05:05 AM