త్వరలో ఏపీలో ‘సదరన్ రూట్స్’ : టీజీ భరత్
ABN , Publish Date - Jul 08 , 2026 | 04:06 AM
అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన సదరన్ రూట్స్ సంస్థ త్వరలోనే ఏపీలో ఒక అత్యాధునిక పెకాన్ గింజల పొట్టు తీసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుందని..
అమరావతి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన సదరన్ రూట్స్ సంస్థ త్వరలోనే ఏపీలో ఒక అత్యాధునిక పెకాన్ గింజల పొట్టు తీసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. న్యూయార్క్ పర్యటనలో ఉన్న ఆయన.. మంగళవారం ఎస్సార్ క్యాపిటల్ ప్రెసిడెంట్, సీఈవో మధు వప్పులూరి, సదరన్ రూట్స్ ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమై చర్చలు జరిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని అక్కడి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలను వివరించారు.