South Central Railway: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా జాగ్రత్తలు పాటించండి
ABN , Publish Date - Jan 13 , 2026 | 06:57 AM
పండగ సీజన్ దృష్ట్యా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైలు రాకపోకల సమయాలు, టికెట్ కౌంటర్ల వద్ద రద్దీ, ప్రయాణికుల భద్రత...
రైల్వే అధికారులకు దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ సూచనలు
విజయవాడ (రైల్వేస్టేషన్), జనవరి 12 (ఆంధ్రజ్యోతి): పండగ సీజన్ దృష్ట్యా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైలు రాకపోకల సమయాలు, టికెట్ కౌంటర్ల వద్ద రద్దీ, ప్రయాణికుల భద్రత, తదితర అంశాలపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ సోమవారం సమీక్ష నిర్వహించారు. జోన్ పరిధిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సికింద్రాబాద్‌లోని రైలు నిలయం నుంచి ఆయన సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్, నాందేడ్ డివిజన్లకు చెందిన డీఆర్‌ఎంలు, ఆయా విభాగాల ముఖ్య అధిపతులతో అదనపు జనరల్ మేనేజర్ సత్యప్రకా్‌షతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవాస్తవ మాట్లాడుతూ రద్దీ నియంత్రణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదేశాలు జారీ చేశారు.