Share News

ల్యాండ్‌ టైటిలింగ్‌ అత్యంత దుర్మార్గమైన చట్టం

ABN , Publish Date - Jan 28 , 2026 | 06:17 AM

‘వైసీపీ హయాంలో తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అత్యంత దుర్మార్గమైన చట్టం. దీని ద్వారా సామాన్య ప్రజల ఆస్తి హక్కులను జగన్‌రెడ్డి లాక్కునే ప్రయత్నం చేశారు’ అని ఎమ్మెల్యే సోమిరెడ్డి..

ల్యాండ్‌ టైటిలింగ్‌ అత్యంత దుర్మార్గమైన చట్టం

  • ధర్మాన ప్రసాదరావు కేంద్రానికి లేఖ రాయడం సిగ్గు చేటు: సోమిరెడ్డి

అమరావతి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ హయాంలో తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అత్యంత దుర్మార్గమైన చట్టం. దీని ద్వారా సామాన్య ప్రజల ఆస్తి హక్కులను జగన్‌రెడ్డి లాక్కునే ప్రయత్నం చేశారు’ అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘దుర్మార్గమైన చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరుతూ వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు కేంద్రానికి లేఖ రాయడం సిగ్గు చేటు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. కేంద్రం... ప్రభుత్వ అధికారులను నియమించమంటే... ‘ఏ వ్యక్తినైనా...’ అనే పదాన్ని చేర్చి తమకు అనుకూలంగా ఉండే విశ్రాంత అధికారులతో పేదల భూములు కబ్జా చేసేందుకు వైసీపీ సిద్ధమైంది. వైసీపీ తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ బ్రిటీష్‌ కాలం నాటి నిబంధనల కంటే దారుణంగా ఉంది’ అని సోమిరెడ్డి అన్నారు.

Updated Date - Jan 28 , 2026 | 06:18 AM