నాడు పెంచి.. నేడు ధర్నాలా..?: సోమిరెడ్డి
ABN , Publish Date - May 20 , 2026 | 04:02 AM
వైసీపీ హయాంలో పెట్రోలు, డీజిల్ ధరలను పెంచి.. ఇప్పుడు ఆ పార్టీ నాయకులు ధర్నాలు చేస్తుండటం విడ్డూరంగా ఉందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.
అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో పెట్రోలు, డీజిల్ ధరలను పెంచి.. ఇప్పుడు ఆ పార్టీ నాయకులు ధర్నాలు చేస్తుండటం విడ్డూరంగా ఉందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. అభివృద్ధిలో రాష్ట్రాన్ని నంబర్‌వన్ స్థానంలో ఉంచకపోయినా.. పెట్రోలు, డీజిల్ ధరల్లో మాత్రం ఏపీని దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా వైసీపీ నిలిపిందని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో పెట్రో, మద్యం ధరలు అడ్డగోలుగా పెంచారని, నకిలీ మద్యంతో వేలాది మంది ప్రాణాలు తీశారని మండిపడ్డారు.