Share News

‘కుసుమ్‌’తో సోలార్‌ వెలుగు

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:38 AM

పీఎం కుసుమ్‌ పథకంలో భాగంగా మండలంలో నాలుగు గ్రామాలు, పత్తికొండ మండలంలో ఒక గ్రామంలో సోలార్‌ పవర్‌ జనరేషన ప్లాంటు ఏర్పాటు కానున్నట్లు రాయలసీమ సీజీఎం, జిల్లా నోడల్‌ అధికారిణి పద్మ తెలిపారు.

   ‘కుసుమ్‌’తో  సోలార్‌ వెలుగు
దేవనకొండ వద్ద సోలార్‌ పవర్‌ జనరేషనప్లాటును పరిశీలిస్తున్న సీజీఎం

నాలుగు చోట్ల పవర్‌ ప్లాంట్ల ఏర్పాటు

దేవనకొండ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): పీఎం కుసుమ్‌ పథకంలో భాగంగా మండలంలో నాలుగు గ్రామాలు, పత్తికొండ మండలంలో ఒక గ్రామంలో సోలార్‌ పవర్‌ జనరేషన ప్లాంటు ఏర్పాటు కానున్నట్లు రాయలసీమ సీజీఎం, జిల్లా నోడల్‌ అధికారిణి పద్మ తెలిపారు. మంగళవారం దేవనకొండ, వెలమకూరు గ్రామాల్లో ఆమె పర్యటించారు. ఈదుల దేవరబండ, పి కోటకొండ, దేవనకొండ సభ్‌స్టేషన పరిధిలో 6 మెగా వాట్లు, తెర్నేకల్‌లో 5 మెగా వాట్లు, పత్తికొండ మండలంలోని కోతిరాళ్లలో 3 మెగా వాట్ల సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. పవర్‌ ప్లాంట్‌లో ఒక్కో మోగా వాట్‌కు రూ.4కోట్లతో యంత్రాలను ఏర్పాటు చేస్తారన్నారు. వెలమకూరులో ‘కరెంటోళ్ల జనంబాట’లో ఆమె పాల్గొని పలు కార్యక్రమాలను వివరించారు. వెలమకూరులో 24 గంట నిరంతరం విద్యుత (ఆర్‌డీఎస్‌ఎస్‌) ఏర్పాటుచేయాలని సర్పంచు భాస్కర్‌, గ్రామస్థులు సీజీఎంను కోరారు. ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్‌, డీఈ విజయరాజు, పత్తికొండ ఏడీ మదనమోహన, ఏఈఈ రవీంద్ర, లైన ఇనస్పెక్టర్‌ వెంకప్ప, లైనమెన్లు నవాబు, సుంకన్న, మద్దిలేటి, ఇలియాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 12:38 AM