Share News

లీజు పేరుతో సోలార్‌ కంపెనీ మోసాలను అరికట్టాలి

ABN , Publish Date - Jul 14 , 2026 | 12:01 AM

పత్తికొండ మం డలంలోని హోసూరు, పెద్దహుల్తి, జొహరాపురం గ్రామాల్లో లీజు పేరుతో రైతులను సోలార్‌ కంపెనీలు చేస్తున్న మోసాలను అరికట్టా లని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్లు, రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు.

లీజు పేరుతో సోలార్‌ కంపెనీ మోసాలను అరికట్టాలి
నిరసన తెలుపుతున్న రైతుసంఘం నాయకులు

పత్తికొండ టౌన్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): పత్తికొండ మం డలంలోని హోసూరు, పెద్దహుల్తి, జొహరాపురం గ్రామాల్లో లీజు పేరుతో రైతులను సోలార్‌ కంపెనీలు చేస్తున్న మోసాలను అరికట్టా లని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్లు, రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. సోమవారం హోసూరు, పెద్దహుల్తి, జొహరాపురం గ్రామాలకు చెం దిన సోలార్‌ బాధితా రైతులు పట్టణంలో ర్యాలీగా తహసీల్దార్‌ కార్యా లయానికి చేరుకోని ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ముందస్తు అగ్రిమెంట్‌ తెలపకుండా, భూసేకరణ చట్టానికి విరుద్ధంగా మధ్యవర్తుల ద్వారా గుడ్డిగా సంతకాలు చేయించుకుని భూమి హక్కులను కోల్పోయేలా, కంపెనీలు మోసాలు చేస్తున్నాయ న్నారు. కంపెనీల నుంచి రైతులను రక్షించి భూ హక్కులు రైతులపై ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆర్డీవో ఓబులేసు, తహసీల్దార్‌ ఉసేన్‌సాహెబ్‌కు, సబ్‌రిజిస్టర్‌ అధికారులకు వేర్వేరుగా వినతి పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో బాధితా రైతులు బనగాని శ్రీనివాసులు, రాజశేఖర్‌నాయుడు, జొలాపురం లక్ష్మీనారాయణ, రైతు సంఘం నాయకులు రంగారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, కారప్ప, వెంకటేశ్వరరెడ్డి, రవిచంద్ర పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 12:01 AM