Share News

భూసార పరీక్షలు చేయించుకోవాలి

ABN , Publish Date - Feb 10 , 2026 | 11:11 PM

రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వనరుల కేంద్రం సునీత సూచించా రు.

 భూసార పరీక్షలు చేయించుకోవాలి
మాట్లాడుతున్న జిల్లా అధికారి సునీత

మద్దికెర, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వనరుల కేంద్రం సునీత సూచించా రు. మంగళవారం పెరవలి గ్రామ సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారి రవి ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ రైతులు భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల ఏ పంటలు సాగు చేయాలో.. ఏ పంట వేస్తే దిగుబడి వస్తుం దో తెలుసుందన్నారు. రైతులు ఒకే పంటను వేస్తుంటారని, అలా వేయడం వల్ల దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నారు. పంట మార్పి డి చేయడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. అధిక మొత్తంలో రైతులు క్రిమిసంహారక మందులు వాడకూడదన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు బోజరాజు, ప్రవళ్లిక, తదితరులున్నారు.

Updated Date - Feb 10 , 2026 | 11:11 PM