ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతి
ABN , Publish Date - May 16 , 2026 | 05:51 AM
ఒంగోలుకు చెందిన కావేరి ఏసీ స్లీపర్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. పోలీసులు, బస్సు డ్రైవర్లు కథనం మేరకు.. కావేరి ఏసీ స్లీపర్ బస్సు 35మంది ప్రయాణికులతో..
డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెనుప్రమాదం
సురక్షితంగా 35 మంది ప్రయాణికులు
ఉలవపాడు, మే 15(ఆంధ్రజ్యోతి): ఒంగోలుకు చెందిన కావేరి ఏసీ స్లీపర్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. పోలీసులు, బస్సు డ్రైవర్లు కథనం మేరకు.. కావేరి ఏసీ స్లీపర్ బస్సు 35మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి గురువారం రాత్రి 7 గంటలకు తిరుపతికి బయల్దేరింది. శుక్రవారం తెల్లవారుజామున 3గంటలకు ఉలవపాడు మండలం రాజుపాలెం చెరువు సమీపానికి వచ్చేసరికి వెనుక టైరు పేలి పొగలు వచ్చాయి. తర్వాత అదే టైరు నుంచి మంటలు మొదలయ్యాయి. ఇద్దరు డ్రైవర్లు.. ప్రయాణికులను అప్రమత్తం చేసి, వారితోపాటు వారి సామాన్లను కిందకు దించారు. అర్ధగంటలోనే బస్సు మొత్తం అగ్నికీలలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చే సమయానికి బస్సు పూర్తిగా దగ్ధం కాగా వారు మంటలను అదుపు చేశారు. ఒంగోలు నుంచి వచ్చిన మరొక ట్రావెల్స్ బస్సులో ప్రయాణికులను గమ్యస్థానాలకు పంపించినట్లు ఎస్‌ఐ సుబ్బారావు తెలిపారు.