Share News

CM Chandrababu Naidu: ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలతోనే నైపుణ్యాభివృద్ధి

ABN , Publish Date - Jan 11 , 2026 | 03:46 AM

రాష్ట్రానికి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను తీసుకురావడం ద్వారా మన వద్దే నైపుణ్యాలు పెంచేలా కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.

CM Chandrababu Naidu: ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలతోనే నైపుణ్యాభివృద్ధి

  • రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలను తీసుకొస్తున్నాం

  • ‘సిద్ధార్థ’ 50 ఏళ్లు పూర్తిచేసుకోవడం హర్షణీయం: చంద్రబాబు

  • సిద్ధార్థ అకాడమీ గోల్డెన్‌ జూబ్లీ వేడుకలకు హాజరు

విజయవాడ, జనవరి 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను తీసుకురావడం ద్వారా మన వద్దే నైపుణ్యాలు పెంచేలా కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. సిద్ధార్థ అకాడమీ ఆఫ్‌ జనరల్‌, టెక్నాలజీ ఎడ్యుకేషన్‌ 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా శనివారం విజయవాడలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్‌ ్స అండ్‌ సైన్స్‌ కాలేజీ మైదానంలో నిర్వహించిన గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ విశ్వవిద్యాలయాల క్యాంప్‌సలను అమరావతిలో ఏర్పాటు చేయించాలని సంకల్పించామని సీఎం తెలిపారు. విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, విద్యారంగంలో పెను సంస్కరణలు తీసుకువస్తున్నామని సీఎం తెలిపారు. కిలోమీటరకు ఒక ఎలిమెంటరీ స్కూల్‌, మూడు కిలోమీర్లకు అప్పర్‌ ప్రైమరీ, ఐదు కిలోమీటర్లకు హైస్కూల్‌, ప్రతి మండలంలో జూనియర్‌ కాలేజీ, ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఇంజనీరింగ్‌ కాలేజీ, ప్రతి జిల్లాకు మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేశామన్నారు.


సిద్ధార్థ కృషి అభినందనీయం..

విజయవాడను విద్యలవాడగా మార్చడంలో సిద్ధార్థ సంస్థలు చేసిన కృషి అభినందనీయమన్నారు. లక్షల మంది విద్యార్థులను తీర్చిదిద్ధిన ఘనత సిద్ధార్థ అకాడమీ సాధించిందని వివరించారు. నాడు ఈ అకాడమీ కోసం దాతలు చేసిన సహాయం నేడు రాష్ట్రంలోనే అత్యుత్తమంగా నిలిచిందని కొనియాడారు. 50 ఏళ్లు పూర్తిచేసుకోవడమంటే అకాడమీ నిర్మాణానికి కృషిచేసిన వారి ఐక్యతను తెలియజేస్తోందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న సిద్ధార్థ అకాడమీకి అభినందనలు తెలిపారు. సిద్ధార్థ అకాడమీ నిర్మించిన కళాశాల భవనాలను యూనివర్సిటీగా తీర్చిదిద్దిన ఘనత ఎన్టీఆర్‌దన్నారు. సిద్ధార్థ అకాడమీ అగ్రికల్చర్‌ వర్సిటీని నిర్మించేందుకు నందిగామలో భూమి కావాలని ప్రభుత్వాన్ని కోరిందని, తప్పకుండా ప్రభుత్వం తరఫున సహకరిస్తామన్నారు. అమరావతి నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రపంచంలోని తెలుగువారు, సిద్ధార్థలో విద్యనభ్యసించి స్థిరపడినవారు అమరావతికి రావాలని పిలుపునిచ్చారు.

Updated Date - Jan 11 , 2026 | 03:47 AM