నాన్ క్యాడర్ ఎస్పీలుగా ఆరుగురికి పదోన్నతి
ABN , Publish Date - Mar 31 , 2026 | 06:17 AM
పోలీసు శాఖలో మూడున్నర దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో శాంతి భద్రతల కోసం కృషి చేసిన ఆరుగురు అడిషనల్ ఎస్పీలకు రాష్ట్ర ప్రభుత్వం...
అమరావతి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖలో మూడున్నర దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో శాంతి భద్రతల కోసం కృషి చేసిన ఆరుగురు అడిషనల్ ఎస్పీలకు రాష్ట్ర ప్రభుత్వం నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పించింది. ఈమేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ ఉత్తర్వులు జారీచేశారు. పదోన్నతి పొందిన ఆరుగురూ 1989 బ్యాచ్‌కు చెందిన ఎస్‌ఐలు. విశాఖ క్రైమ్స్ డీసీపీగా సీహెచ్ పాపారావు, సీఐడీ ఎస్పీగా టీ కనకరాజు, ఆక్టోపస్ ఎస్పీగా సీహెచ్ లక్ష్మీపతి, విజయవాడ ట్రాఫిక్ డీసీపీగా నక్కా సూర్యచంద్రరావు, ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా విమల కుమారి, సీఐడీ ఎస్పీగా దేవ ప్రసాద్‌లకు పోస్టింగులు ఇచ్చారు.