వివేకా కేసులో సిట్ నివేదిక ఇవ్వండి
ABN , Publish Date - Mar 10 , 2026 | 04:28 AM
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదికను తమకు అందజేయాలని కోరుతూ...
నిందితుల పిటిషన్.. విచారణ నేటికి వాయిదా
హైదరాబాద్, మార్చి 9(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదికను తమకు అందజేయాలని కోరుతూ నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో నిందితులు పిటిషన్ వేశారు. సీబీఐ కంటే ముందు ఈ కేసును విచారించిన సిట్ రిపోర్టు తమకివ్వాలని కోరారు. అలాగే సీబీఐ.. కోర్టుకు అందించిన 13 లక్షల ఫైళ్లలో చాలా తెరుచుకోవడం లేదంటూ వారి తరఫు న్యాయవాదులు తెలియజేశారు. దీనిని సీబీఐ తోసిపుచ్చింది. కోర్టు అనుమతి ఇస్తే ఆ ఫైళ్లను తెరిచి చూపిస్తామని స్పష్టంచేసింది. తదుపరి విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.