Share News

సజ్జలకు పిలుపు?

ABN , Publish Date - May 30 , 2026 | 04:53 AM

గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం విచారణలో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశముంది.

సజ్జలకు పిలుపు?

  • లిక్కర్‌ స్కామ్‌లో విచారించనున్న సిట్‌

  • నేడో, రేపో నోటీసులిచ్చే చాన్స్‌

గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం విచారణలో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశముంది. వైసీపీలో రాజకీయ వ్యవహారాలు చూసే సజ్జల రామకృష్ణారెడ్డిని సిట్‌ అధికారులు విచారించే అవకాశం ఉన్న ట్లు తెలిసింది. దర్యాప్తులో భాగంగా ఇటీవల లభించిన ఆధారాలతో ఆయనకు ఒకటి, రెండు రోజుల్లో నోటీసులు ఇవ్వనున్నట్టు సమాచారం. సోమవారం తర్వాత ఆయనను విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లిక్కర్‌ కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు, కీలక వ్యక్తులను సిట్‌ విచారించిన సంగతి తెలిసిందే. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత మిథున్‌ రెడ్డి, వైసీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డితో పాటు జగన్‌ ఓఎ్‌సడీ కృష్ణమోహన్‌ రెడ్డి తదితరులను అరెస్ట్‌ చేసింది. తాజాగా జగన్‌ పీఏ కేఎన్‌ఆర్‌ను సిట్‌ అధికారులు విచారించారు. ఈ నేపథ్యంలో సజ్జలకు నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

Updated Date - May 30 , 2026 | 04:54 AM