మద్యం రవాణా కాంట్రాక్టు కేసులో.. మాజీ మంత్రి కారుమూరికి సిట్ నోటీసులు
ABN , Publish Date - Apr 22 , 2026 | 04:28 AM
జగన్ హయాంలో లిక్కర్ రవా ణా కాంట్రాక్టు, టెండర్లలో అక్రమాలకు సంబంధించి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు, ఆయన కుమారుడు సునీల్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీచేశారు.
ఆయన కుమారుడు సునీల్‌కు కూడా
రేపు బెజవాడ రావాలంటూ ఇంటి గోడకు
నోటీసులంటించిన అధికారులు
భీమవరం, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో లిక్కర్ రవా ణా కాంట్రాక్టు, టెండర్లలో అక్రమాలకు సంబంధించి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు, ఆయన కుమారుడు సునీల్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీచేశారు. విజయవాడ కమిషనర్ కార్యాలయంలోని సిట్ ఆఫీసుకు గురువారం(23న) హాజరు కావాలని ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని నివాసంలో వారు లేకపోవడంతో అధికారులు ఆ ఇంటి గోడకు నోటీసులు అంటించారు. వైసీపీ హయాంలో మద్యం రవాణాకు సంబంధించి అవకతవకతలు జరిగినట్లు సిట్ కేసు నమోదుచేసింది. కారుమూరి, ఆయన కుమారుడికి ప్రమేయం ఉన్నట్లు గుర్తించింది. వారిద్దరిపై ఐపీసీ సెక్షన్లు 420, 409, 468, 471, బీఎన్‌ఎస్ సెక్షన్లు 111, 212, 217, 317, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 7, 7ఏ, 8, 9, 10, 12, 13 (1 ఏ, బీ), 13(2) కింద కేసు నమోదు చేసింది. గోడకు నోటీసులు అంటించిన కాసేపటికే వాటిని ఎవరో చించివేశారు. వైసీపీ జమానాలో మద్యం రవాణాచేసే కాంట్రాక్టులో రూ.200 కోట్ల నుంచి 400 కోట్ల వరకు దోచుకున్న వ్యవహారంలో సీఐడీ గత నెలలో కేసు నమోదుచేసింది.