‘సిగ్మా’ ముసుగులో దందా
ABN , Publish Date - Jun 19 , 2026 | 04:02 AM
వేల కోట్ల దోపిడీకి మద్యం ముఠా స్కెచ్ వేసి దోచుకుంటే.. మద్యం రవాణా కాంట్రాక్టులు కూడా దక్కించుకుని వైసీపీ నేతలు పాంతాల వారీగా దోచేసుకున్నారు.
‘సుదర్శన్’ నుంచి సునీల్‌కు రూ.28 కోట్లు
ఆయన భార్య ఖాతాలోకి రూ.9.4 కోట్లు
ముందే తేల్చిన సిట్
అమరావతి, జూన్ 18(ఆంధ్రజ్యోతి): వేల కోట్ల దోపిడీకి మద్యం ముఠా స్కెచ్ వేసి దోచుకుంటే.. మద్యం రవాణా కాంట్రాక్టులు కూడా దక్కించుకుని వైసీపీ నేతలు పాంతాల వారీగా దోచేసుకున్నారు. ఈ వివరాలను సిట్ ముందుగానే బహిర్గతం చేసింది. భారీగా లబ్ధి పొందే ప్లాన్‌లో భాగంగా రాజ్ కసిరెడ్డి తన ముసుగు సంస్థ సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్‌కు లిక్కర్ రవాణా కాంట్రాక్టు దక్కించుకున్నారు. ఆ సంస్థ నుంచి సుదర్శన్ కన్‌స్ట్రక్షన్స్‌కు సబ్ కాంట్రాక్టు ఇప్పించడంలో నాటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. ప్రతిఫలంగా ఆదాయంలో 85 శాతం ఆయన కుటుంబమే తీసుకున్నట్లు వెల్లడించింది. అలాగే సుదర్శన్ కన్‌స్ట్రక్షన్స్ నుంచి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ ఖాతాలోకి రూ.28 కోట్లు చేరాయి. ఆయన భార్య కీర్తి ఖాతాల్లోకి రూ.9.4 కోట్లు జమయ్యాయి. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర సబ్ కాంట్రాక్టును పర్యవేక్షించిన సునీల్.. 2021 నవంబరు నుంచి 2023 డిసెంబరు వరకూ జరిపిన ఆర్థిక లావాదేవీలపై సిట్ డిజిటల్ ఆధారాలుసేకరించి.. మొత్తం వ్యవ హారాన్ని బయటపెట్టింది. ప్రతి ఇన్వాయిస్ నుం చి రూ.40 లక్షలు నుంచి రూ.60 లక్షలు అదనం గా తీసుకున్నట్లు తేల్చింది. నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయం అద్దె, కార్లకు ఈఎంఐ కూడా ముడుపుల నుంచే వచ్చినట్లు ఆధారాలు లభించాయి.