కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిన జగన్
ABN , Publish Date - May 21 , 2026 | 04:41 AM
రాష్ట్రంలో అలజడులు సృష్టించి ప్రభుత్వంపై అపవాదు వేయడమే లక్ష్యంగా వైసీపీ కుట్రలు చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో...
సిట్ చార్జిషీట్‌తో కుట్రలన్నీ వెల్లడి: కొల్లు రవీంద్ర
అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అలజడులు సృష్టించి ప్రభుత్వంపై అపవాదు వేయడమే లక్ష్యంగా వైసీపీ కుట్రలు చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ నాయకుల కల్తీ మద్యం కుట్రలు.. సిట్ దాఖలు చేసిన చార్జిషీటుతో బట్టబయలు అయ్యాయన్నారు. కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిన కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ ప్రధాన నిందితుడిగా తేలారని చెప్పారు. ఈ కుట్రలో అద్దేపల్లి జనార్ధన్, వాళ్ల సొంత తమ్ముడు జగన్మోహన్‌తోపాటు పలువురు వైసీపీ నేతల పాత్ర కూడా ఉందన్నారు. ఇటీవల వెలుగు చూసిన పాస్టర్ వ్యవహారం చూస్తే రాష్ట్రంలో కులమతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయానికి వైసీపీ నాయకులు తెరదీశారని అర్ధమవుతోందన్నారు. వైసీపీ కుట్రలన్నింటినీ బట్టయలు చేస్తామని చెప్పారు.