‘సర్’ను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Jun 27 , 2026 | 11:44 PM
కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘సర్’ సర్వేను వేగవంతం చేయాలని పత్తికొండ ఆర్డీవో ఓబులేసు ఆదేశించారు.
ఆర్డీవో ఓబులేసు
ఎం.అగ్రహారంలో సర్వే తనిఖీ
మద్దికెర, జూన 27 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘సర్’ సర్వేను వేగవంతం చేయాలని పత్తికొండ ఆర్డీవో ఓబులేసు ఆదేశించారు. శనివారం మండలంలోని ఎం.అగ్రహారం గ్రామంలో సర్ సర్వేను తనిఖీ చేశారు. అనంతరం సచివాలయంలో ఓటరు జాబితాను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు ఎంతో విలువైందని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. బీఎల్వోలు ఇంటింటికి తిరిగి ఫారాలు అందజేయాలని, ఆ ఫారాలతో పాటు ఓటరు నుంచి ఆధార్ కార్డు, ఫోన నెంబర్, కలర్ పాస్‌ఫొటో తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే బీఎల్వోలే బాధ్యత వ హించాలన్నారు. శా శ్వతంగా గ్రామం వ దిలి వెళ్లిన వారు, మ రణించిన వారి పేర్లును తొలగించాలన్నా రు. కార్యాలయాలకే పరిమితం కాకుండా సర్వేను వేగవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ గూండాల్ నాయక్, వీఆర్వో స్వర్ణలత, పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్ ఉన్నారు.