Share News

రామాయపట్నం పోర్టుకు సింగపూర్‌ ప్రతినిధులు

ABN , Publish Date - Feb 04 , 2026 | 05:02 AM

ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టును మంగళవారం సింగపూర్‌ ప్రతినిధుల బృందం సందర్శించింది.

రామాయపట్నం పోర్టుకు సింగపూర్‌ ప్రతినిధులు

కందుకూరు, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టును మంగళవారం సింగపూర్‌ ప్రతినిధుల బృందం సందర్శించింది. సింగపూర్‌ ట్రేడ్‌ ఇండస్ట్రీస్‌ ఉన్నతాధికారి ఫ్రాన్సిస్‌ చూవా, సింగపూర్‌ ఎకనామికల్‌ డెవల్‌పమెంటు బోర్డు కన్సల్టెంట్‌ చూవా నాయకత్వంలో నలుగురు ప్రతినిధులు పోర్టును సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించి, పోర్టులో కార్యకలాపాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న తీరుపై సింగపూర్‌ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు.

Updated Date - Feb 04 , 2026 | 05:03 AM