Share News

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో శతక శంఖారావం

ABN , Publish Date - Mar 16 , 2026 | 05:55 AM

సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకల్లో భాగంగా అమెరికా గడ్డపై తెలుగు పద్యాలతో తొలిసారిగా గిన్నీస్‌ రికార్డు నెలకొల్పే యత్నానికి రూపకల్పన జరిగింది.

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో శతక శంఖారావం

  • అమెరికాలో తెలుగు పద్యాలతో గిన్నీస్‌ రికార్డుకు యత్నం

  • ఆగస్టు 8న కాలిఫోర్నియాలోని ఓక్‌లాండ్‌ ఎరీనాలో కార్యక్రమం

  • మార్చి 31లోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సిలికానాంధ్ర పిలుపు

(డల్లాస్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకల్లో భాగంగా అమెరికా గడ్డపై తెలుగు పద్యాలతో తొలిసారిగా గిన్నీస్‌ రికార్డు నెలకొల్పే యత్నానికి రూపకల్పన జరిగింది. ఆగస్ట్‌ 8వ తేదీన కాలిఫోర్నియాలోని ఓక్‌లాండ్‌ ఎరీనాలో శతక శంఖారావం పేరిట ఈ కార్యక్రమం నిర్వహిస్తామని సిలికానాంధ్ర సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్‌ తెలిపారు. వేమన శతకం నుంచి 9, సుమతీ శతకం నుంచి 9 పద్యాలతో 1800మంది ప్రవాస బాలబాలికలు, యువతీయువకులు, పెద్దలు ఈ శంఖారావంలో పాల్గొని గిన్నీస్‌ రికార్డుకు యత్నిస్తారని చెప్పారు. మార్చి 31లోగా silerjubilee.silicnandhra.org/registration ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ఆయన సూచించారు. గిన్నీస్‌ సంస్థ ప్రతినిధులు ఈ కార్యక్రమ పర్యవేక్షకులుగా హాజరవుతారని, పాల్గొనే ప్రతి ఒక్కరికీ గిన్నీస్‌ సంస్థ నుంచి సర్టిఫికెట్‌ లభిస్తుందని ఆనంద్‌ తెలిపారు. ఈ సర్టిఫికెట్‌ ద్వారా కాలేజీ ప్రవేశాలకు స్వల్ప ప్రాధాన్యత లభిస్తుందని వెల్లడించారు. పద్యాల ఆడియో ఫైల్స్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయన్నారు.

Updated Date - Mar 16 , 2026 | 05:56 AM