1న సిలికానాంధ్ర రజతోత్సవం
ABN , Publish Date - Jul 19 , 2026 | 03:11 AM
తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణే ధ్యేయంగా 2001లో ప్రారంభమైన ‘సిలికానాంధ్ర’ సంస్థ రజతోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఆగస్టు 1న కాలిఫోర్నియాలోని ఓక్‌ల్యాండ్ ఎరీనాలో ఈ వేడుకలు..
ఒకే వేదికపై మూడు గిన్నీస్ రికార్డులే లక్ష్యం!
(డల్లాస్ నుంచి కిలారు గోకుల్‌కృష్ణ)
తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణే ధ్యేయంగా 2001లో ప్రారంభమైన ‘సిలికానాంధ్ర’ సంస్థ రజతోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఆగస్టు 1న కాలిఫోర్నియాలోని ఓక్‌ల్యాండ్ ఎరీనాలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 3 గిన్నీస్ రికార్డులు నెలకొల్పడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్, అధ్యక్షురాలు తనుగుల ప్రియ తెలిపారు. గిన్నీస్ ప్రతినిధి మైకేల్ ఎంప్రిక్ స్వయంగా హాజరై ఈ రికార్డుల ప్రయత్నాన్ని సమీక్షిస్తారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 వేల మంది అతిథులు ఈ వేడుకల్లో సందడి చేస్తారని ఆనంద్ వెల్లడించారు. అమెరికా నేలపై తెలుగు సాం స్కృతిక ప్రదర్శనలతో ఇలాంటి భారీ రికార్డుల ప్రయత్నం జరగడం ఇదే తొలిసారి. ఇందులో భాగంగా నిర్వహించే ‘‘సంగీతామృతవర్షిణి’’ కార్యక్రమంలో 1000 మంది శాస్త్రీయ గాయనీ గాయకులు ఏకకాలంలో వాగ్గేయకారుల కీర్తనలను ఆలపించనున్నారు. అలాగే ‘‘లయామృతవర్షిణి ’’లో 300 మంది మృదంగ విద్వాంసులు పాల్గొంటారు.