అట్టహాసంగా ‘సిద్ధార్థ’ సిల్వర్ జూబ్లీ వేడుకలు
ABN , Publish Date - Feb 09 , 2026 | 05:15 AM
తిరుపతి జిల్లా నారాయణవనం మండలంలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో సిల్వర్ జూబ్లీ వేడుకలను ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు.
తేజ సజ్జా, శ్రీలీల రాకతో సందడి
నారాయణవనం, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా నారాయణవనం మండలంలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో సిల్వర్ జూబ్లీ వేడుకలను ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్య అతిథి న్యూఢిల్లీ ఏఐసీటీయూ సీఈవో బుద్దా చంద్రశేఖర్, అనంతపురం జేఎన్‌టీయూ వైస్ చాన్స్‌లర్ సుదర్శనరావు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని.. సెలబ్రేషన్స్ జరుపుకోవడం ఆనందకరమని తెలిపారు. విద్యార్థులు కళాశాలలోని మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఆధునాతన సాంకేతిక విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాక్షించారు. అమరావతిలో జరిగిన క్యాంటమ్ వ్యాలీలో రన్నర్‌పగా నిలిచి రూ.30వేల నగదుతోపాటు, షీల్డు అందుకున్న కళాశాల విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా సినీ హీరో తేజ సజ్జా, హీరోయిన్ శ్రీలీల విచ్చేసి డ్యాన్స్‌లతో విద్యార్థులను అలంరించారు. డ్యాన్స్ మాస్టర్ నటరాజ్ బృందం ప్రదర్శన ఆకట్టుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బృందం మూడు గంటల పాటు నిర్వహించిన సంగీత కచేరీ ప్రత్యేకంగా నిలిచింది. ఈ సందర్భంగా మరో ముఖ్య అతథి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో చైర్మన్ అశోకరాజు, ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.