చదువుల తల్లికి ఎస్‌ఐ గురజాల ఆపన్నహస్తం
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:01 AM
చదువులో రా ణిస్తున్న ఓ పేద విద్యార్థినికి కళా శాల ఫీజు చెల్లించేందుకు రూ.22 వేలు అందజేసిన ఎస్‌ఐ గురజా ల దిలీప్ కుమార్ మరోసారి తన మనసును చాటుకున్నారు.
విద్యార్థిని విద్య కోసం రూ.22వేలు అందజేత
హొళగుంద, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): చదువులో రా ణిస్తున్న ఓ పేద విద్యార్థినికి కళా శాల ఫీజు చెల్లించేందుకు రూ.22 వేలు అందజేసిన ఎస్‌ఐ గురజా ల దిలీప్ కుమార్ మరోసారి తన మనసును చాటుకున్నారు. హొళ గుందకు చెందిన బండారి మమత అనంతపురం ఆర్డీటీ సం స్థ సహకారంతో కర్నూలులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడి యట్ చదువుతోంది. విద్యార్థిని ప్రతిభ, కుటుంబ నేపథ్యం గురించి ఎస్‌ఐ దిలీప్ కుమార్ ద్వారా అనంతపురం జిల్లా సీఐ విశ్వనాథ్ చౌదరి తెలుసుకున్నారు. విద్యార్థిని చదువు ఆగిపోకూడదని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో మాట్లాడి ఆర్డీటీ సంస్థ నుంచి రూ.40వేలు సెమీ స్కాలర్‌షిప్ మంజూరు చేయించారు. ఇదే క్రమంలో హొళగుంద ఎస్‌ఐ దిలీప్ కూడా రూ.22వేలు ఉన్నత విద్య నిమిత్తం సోమవారం అందజేశారు. నలుగురు కుమార్తెలు ఉన్న కుటుంబంలో మమత రెండో అమ్మాయి అన్నారు. దాతలు ముందుకు వచ్చి చదువులో రాణిస్తున్న విద్యార్థిని మమతకు సహకరించాలని కోరారు.