Share News

నెదర్లాండ్స్‌లో శ్రీవారి ఆలయానికి 33.5 ఎకరాలు

ABN , Publish Date - Apr 05 , 2026 | 04:53 AM

నెదర్లాండ్స్‌లో శ్రీవారి ఆలయం నిర్మాణం కానుంది. దాదాపు రూ.250 కోట్లతో నిర్మించే ఈ ఆలయానికి టీటీడీ సహకారమివ్వనుంది.

నెదర్లాండ్స్‌లో శ్రీవారి ఆలయానికి 33.5 ఎకరాలు

  • రూ.250 కోట్లతో నిర్మాణానికి ముందుకొచ్చిన వసుదైవ కుటుంబకం

  • సహకారం అందించాలని టీటీడీకి విజ్ఞప్తి చేసిన సంస్థ

తిరుమల, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): నెదర్లాండ్స్‌లో శ్రీవారి ఆలయం నిర్మాణం కానుంది. దాదాపు రూ.250 కోట్లతో నిర్మించే ఈ ఆలయానికి టీటీడీ సహకారమివ్వనుంది. హిందూ ధర్మప్రచారంలో భాగంగా మన దేశంలోని అన్ని రాష్ర్టాలతో పాటు విదేశాల్లోనూ శ్రీవారి ఆలయాలను నిర్మించాలని సీఎం చంద్రబాబు సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నెదర్లాండ్స్‌లో ఎన్‌ఆర్‌ఐలతో కూడిన వసుదైవ కుటుంబకం(ఎస్వీకే) సంస్థ శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించాలని ఆ దేశ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో పభుత్వం 33.5 ఎకరాల భూమిని కేటాయించింది. దాదాపు రూ.250 కోట్లతో ఆలయాన్ని నిర్మించేందుకు సిద్ధమైన ఎస్వీకే సంస్థ ప్రతినిధులు హైదరాబాద్‌లో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడిని కలిశారు. స్థల పరిశీలన, ఆలయ గోపురాలు, ప్రాకారం, మండపాల, శిల్పకళ, వేద పాఠశాల ఏర్పాటు, స్థపతి తదితర అంశాల్లో సహకారం అందించాలని కోరారు. టీటీడీ నుంచి అవసరమైన సహకారం అందిస్తామని చైర్మన్‌ వారికి హామీ ఇచ్చారు.

Updated Date - Apr 05 , 2026 | 04:53 AM