Share News

ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి

ABN , Publish Date - May 20 , 2026 | 12:06 AM

బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని డీఈవో సుధాకర్‌ ఆదేశించారు.

ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి
మాట్లాడుతున్న డీఈవో సుధాకర్‌

క్రిష్ణగిరి, మే 19 (ఆంధ్రజ్యోతి): బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని డీఈవో సుధాకర్‌ ఆదేశించారు. మంగళవారం బడిపిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా క్రిష్ణగిరిలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, బ్యాగు, యూనిపామ్‌ ఉచితంగా అందిస్తున్నామన్నారు. పదవ తరగతి ఫలితాలలో ప్రైవేట్‌ పాటశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు సాధించాయని అన్నారు. అనంతరం పాఠశాలలో ఉపాధ్యాయులుతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. సమావేశంలో ఎంఈవోలు సునంద, మైఖేల్‌, వివేక్‌ పబ్లిక్‌ స్కూల్‌ కరస్పాడెంట్‌ చెన్నయ్య తదితరులు ఉన్నారు.

Updated Date - May 20 , 2026 | 12:06 AM