ప్రజలకు అందుబాటులో ఉండాలి
ABN , Publish Date - Nov 09 , 2026 | 11:21 PM
ప్రజలు మీపై ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు సూచించారు.
మద్దికెర, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రజలు మీపై ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు సూచించారు. మద్దికెర జడ్పీటీసీ గా గెలుపొందిన బాలసునీత, యజ్ఞం వెంకట మాధవ దంపతులు ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించారు. ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందేలా చూడాలని, పార్టీకి మంచి పేరు తీసుకురావాలన్నారు. నాయకులు మోహన, శేఖర్, వెంకటేశ, మురళి మోహన రెడ్డి పాల్గొన్నారు.
మండలాభివృద్ధి కోసం కృషి చేస్తాం
తుగ్గలి: మండల అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని జడ్పీటీసీ సభ్యురాలు మిద్దె గీతా కుమారి, ఎంపీపీ అభ్యర్థి వరలక్ష్మి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే కేఈ స్వగృహంలో ఉమ్మడి జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన తుగ్గలి నాగేంద్రతో కలిసి జడ్పీటీసీ పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మిద్దె వెంకటేశ యాదవ్, వెంకటస్వామి, గురుస్వామి, చంద్రశేఖర్ యాదవ్, బాలన్న, మిద్దె రవి, మధుబాబు, కొమ్ము వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.