కుక్క నోట.. మనిషి కాలు!
ABN , Publish Date - May 15 , 2026 | 05:42 AM
తొలగించిన మనిషి కాలును ఓ వీధి కుక్కనోట కరుచుకుని.. ప్రభుత్వాసుపత్రి ఆవరణలో హల్‌చల్ చేసింది.. ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యాన్ని చూసిన రోగులు, వారి సహాయకులు భీతావహులయ్యారు.
విజయవాడ ఆస్పత్రిలో భీతావహ దృశ్యం
విజయవాడ, మే 14 (ఆంధ్రజ్యోతి): తొలగించిన మనిషి కాలును ఓ వీధి కుక్కనోట కరుచుకుని.. ప్రభుత్వాసుపత్రి ఆవరణలో హల్‌చల్ చేసింది.. ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యాన్ని చూసిన రోగులు, వారి సహాయకులు భీతావహులయ్యారు. కొంతమంది కడుపులో దేవడంతో వాంతులు చేసుకున్నారు. విజయవాడ న్యూ జీజీహెచ్‌లో గురువారం వెలుగుచూసిన ఈ హృదయ విదారక దృశ్యం ఆస్పత్రి నిర్వహణలో నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. ఆసుపత్రి బయో మెడికల్ వేస్ట్ నిల్వ గదిలో నుంచి మనిషి కాలు(యాక్సిడెంట్, లేదా షుగర్ ఇతర వ్యాధి కారణంగా రోగి కాలును తొలగించి ఉంటారు)ను ఒక శునకం బయటికి ఎత్తుకొచ్చినా తెలుసుకోలేకపోవటం చూస్తే సంబంధిత వైద్య సిబ్బంది, కాంట్రాక్టు సంస్థ ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కాగా, ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధిని బయోవేస్ట్ రూమ్‌కు వెళ్లకుండా అడ్డుపడ్డారు.