ప్రపంచ దేశాల్లో అనిశ్చితి: శివరాజ్ సింగ్ చౌహాన్
ABN , Publish Date - Feb 23 , 2026 | 04:43 AM
‘ప్రపంచ దేశాల్లో అనిశ్చితి నెలకొంది. కొన్ని దేశాల స్వార్థంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న క్రమంలో భారత్ శాంతిపక్షం వహిస్తూ ప్రజలంతా...
కుటుంబంతో శ్రీవారి దర్శనం అదృష్టమని వ్యాఖ్య
తిరుమల, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): ‘ప్రపంచ దేశాల్లో అనిశ్చితి నెలకొంది. కొన్ని దేశాల స్వార్థంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న క్రమంలో భారత్ శాంతిపక్షం వహిస్తూ ప్రజలంతా అభివృద్ధి మార్గంలో సుఖశాంతులతో వర్థిల్లాలని కోరుకుంటోంది’ అని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, కుటుంబంతో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తామంతా సన్మార్గంలో నడిచి ప్రజల సేవలో మరింతగా మమేకమయ్యే శక్తిని ఇవ్వాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.