Share News

Excise Police Petition: షిబు, జినేష్‌లను కస్టడీకి ఇవ్వండి

ABN , Publish Date - Jan 06 , 2026 | 06:34 AM

నకిలీ మద్యం తయారీ కేసులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న షిబు, జినేష్ లను నాలుగు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్‌ పోలీసులు విజయవాడ..

Excise Police Petition: షిబు, జినేష్‌లను కస్టడీకి ఇవ్వండి

  • కోర్టులో ఎక్సైజ్‌ పోలీసుల పిటిషన్‌

విజయవాడ, జనవరి 5(ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం తయారీ కేసులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న షిబు, జినేష్ లను నాలుగు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్‌ పోలీసులు విజయవాడ ఆరో అదనపు ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కేరళకు చెందిన వారు ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావుకు భారీగా స్పిరిట్‌, కార్మెల్‌ సరఫరా చేశారు. ఆ ఇద్దరినీ ములకలచెరువు ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేసి కొద్దిరోజుల క్రితం మదనపల్లె జైలుకు తరలించారు. తర్వాత భవానీపురం ఎక్సైజ్‌ పోలీసులు పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. వారి నుంచి మరింత సమాచారం రాబట్టడానికి నాలుగు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు.

Updated Date - Jan 06 , 2026 | 06:34 AM