జీరామ్‌జీతో పనిదినాలు పెరగడం అబద్ధం: షర్మిల
ABN , Publish Date - Mar 07 , 2026 | 06:09 AM
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వీబీ-జీరామ్‌జీ చట్టం ద్వారా 125 రోజుల పనిదినాల కల్పన ఉత్త అబద్ధమని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు.
గుడివాడ, మార్చి 6(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వీబీ-జీరామ్‌జీ చట్టం ద్వారా 125 రోజుల పనిదినాల కల్పన ఉత్త అబద్ధమని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఈ చట్టంతో గ్రామస్వరాజ్యం నాశనమవుతుందన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ, గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామాల్లో శుక్రవారం ఆమె ఉపాధి హామీ చట్టం- పరిరక్షణ యాత్ర చేపట్టి ప్రజల నుద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ తెచ్చిన ఉపాధి హామీ చట్టంతో గ్రామసభలు నిర్వహించి, గ్రామానికి ఏం పనులు కావాలో గుర్తించేవారన్నారు. దాన్ని రద్దు చేసి, బీజేపీ తెచ్చిన కొత్త చట్టంతో పనిదినాలు తగ్గిపోనున్నాయని, వలసలు పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. పాత చట్టాన్ని పునరుద్ధరించాలని ఆమె డిమాండ్ చేశారు.