సూపర్ సిక్స్... అట్టర్ ఫ్లాప్
ABN , Publish Date - Jun 13 , 2026 | 06:15 AM
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అట్టర్ ఫ్లాప్‌గా మిగిలాయని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు.
అప్పులు ఫుల్లు... అభివృద్ధి నిల్లు...: షర్మిల
అమరావతి, జూన్ 12(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అట్టర్ ఫ్లాప్‌గా మిగిలాయని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. కూటమి రెండేళ్ల పాలనపై శుక్రవారం ఎక్స్ వేదికగా ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘‘రెండేళ్ల కూటమి పాలనంతా ‘అప్పులు ఫుల్లు... అభివృద్ధి నిల్’... ‘ప్రచారం పీక్స్... పాలన వీక్’ అన్నట్లుగా ఉంది. పాలనంతా మాయాబజార్‌లా ఉంది. రాష్ట్ర పునర్నిర్మాణం జరగలేదు. పునరంకితానికీ దిక్కులేదు. ఉద్ధరిస్తారని అధికారమిస్తే రాష్ట్ర ప్రజలకు పెద్ద పంగనామాలు పెట్టింది. గంపెడు హామీలు ఇచ్చి చిటికెడు అమలు చేసింది. విజయోత్సవ సభులు పెట్టడానికి కూటమి నేతలకు సిగ్గుండాలి’ అని షర్మిల విమర్శించారు.