Share News

సీఈసీపై అభిశంసనకు వైసీపీ మద్దతివ్వాలి: షర్మిల

ABN , Publish Date - Mar 18 , 2026 | 04:57 AM

ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్వర్‌పై ఇండియా కూటమి పెట్టే అభిశంసన తీర్మానానికి జగన్‌ మద్దతు ఇవ్వాలని పీసీసీ చీఫ్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.

సీఈసీపై అభిశంసనకు వైసీపీ మద్దతివ్వాలి: షర్మిల

విజయనగరం, అరకులోయ, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్వర్‌పై ఇండియా కూటమి పెట్టే అభిశంసన తీర్మానానికి జగన్‌ మద్దతు ఇవ్వాలని పీసీసీ చీఫ్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ పథకం పరిరక్షణలో భాగంగా మంగళవారం విజయనగరం జిల్లా ఎస్‌.కోట నియోజకవర్గం జామి, అల్లూరి జిల్లా అరకులోయ మండలం మాడగడ గ్రామాల్లో పర్యటించారు. ‘రాష్ట్రంలో ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందని, వైసీపీ దొంగ ఏడ్పులు ఏడ్చింది. ఇప్పుడు అదే సీఈసీ పై అభిశంసన పెట్టే తీర్మానంపై మాత్రం వైసీపీ ఎంపీలు సంతకాలు పెట్టలేదు? జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే ఇండియా కూటమి పెట్టిన అభిశంసన తీర్మానంపై తన ఎంపీలతో సంతకాలు పెట్టించాలి’ అని షర్మిల డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 18 , 2026 | 04:57 AM