అమరావతిపై జగన్ అబద్ధాలు: షరీఫ్
ABN , Publish Date - May 02 , 2026 | 04:37 AM
అమరావతి నిర్మాణంపై జగన్ అండ్ కో అబద్ధాలు ప్రచారం చేయడం దుర్మార్గమని రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ సలహాదారు ఎంఏ షరీఫ్ అన్నారు.
అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): అమరావతి నిర్మాణంపై జగన్ అండ్ కో అబద్ధాలు ప్రచారం చేయడం దుర్మార్గమని రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ సలహాదారు ఎంఏ షరీఫ్ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘తెలంగాణలో అధునాతన సెక్రటేరియట్ నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.6500 ఖర్చు చేశారు. అమరావతిలో చదరపు అడుగుకు సగటున రూ.6980 ఖర్చవుతుంది. అయితే జగన్ అండ్ కో రూ.12 వేల నుంచి రూ.14 వేలు ఖర్చవుతుందంటూ నోటికొచ్చిన లెక్కలు చెబుతున్నారు. ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చుచేసి రాజభవనాలు నిర్మించుకున్న జగన్... అమరావతి నిర్మాణ వ్యయంపై అబద్ధాలు ఆడటం హాస్యాస్పదం’ అని షరీఫ్ మండిపడ్డారు.