కేంద్రమంత్రి రాజీనామా చేయాలి
ABN , Publish Date - Jun 08 , 2026 | 04:58 AM
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రశ్నపత్రాల లీకేజీ జరుగుతోందని ఎస్‌ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శులు ప్రసన్న కుమార్, రామన్న విమర్శించారు.
నీట్ లీకేజీపై ఎస్‌ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ధర్నా
విజయవాడ, జూన్ 7(ఆంధ్రజ్యోతి): బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రశ్నపత్రాల లీకేజీ జరుగుతోందని ఎస్‌ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శులు ప్రసన్న కుమార్, రామన్న విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో ధర్నా నిర్వహించాయి. లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ విద్యా సంవత్సరం నీట్ పేపర్ లీకేజీ కారణంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందన్నారు. ఈ పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, దీనిపై స్పందించకపోతే రాష్ట్ర, దేశవ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.