Share News

ఠారెత్తిస్తున్న ఎండ.. నగరడోనలో 45.4 డిగ్రీలు

ABN , Publish Date - Apr 20 , 2026 | 04:22 AM

రాష్ట్రంలో ఎండలు ఠారెత్తించాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 279 మండలాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఠారెత్తిస్తున్న ఎండ.. నగరడోనలో 45.4 డిగ్రీలు

అమరావతి, విశాఖపట్నం, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండలు ఠారెత్తించాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 279 మండలాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా కర్నూలు జిల్లా నగరడోనలో 45.4 డిగ్రీలు రికార్డయింది. కడప జిల్లా ఖాజీపేటలో 44.5, కాకినాడ జిల్లా కరపలో 44.4, అనంతపురం జిల్లా రాయదుర్గం, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44.3 డిగీల్ర గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ అనిశ్చితి ప్రభావంతో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో వర్షం కురిసింది. కాగా, సోమవారం పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Updated Date - Apr 20 , 2026 | 04:22 AM