Spurious Liquor Case: నకిలీ మద్యం కేసులో ఏడుగురు నిందితులకు షరతులతో బెయిల్
ABN , Publish Date - Jan 10 , 2026 | 05:01 AM
నకిలీ మద్యం కేసులో తంబళ్లపల్లె జూనియర్ సివిల్ కోర్టు శుక్రవారం ఏడుగురు నిందితులకు షరతులతో బెయిల్...
ములకలచెరువు, జనవరి 9(ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం కేసులో తంబళ్లపల్లె జూనియర్ సివిల్ కోర్టు శుక్రవారం ఏడుగురు నిందితులకు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. అన్నమయ్య జిల్లా ములకలచెరువు కేంద్రంగా జరిగిన నకిలీ మద్యం తయారీ కేసులో ఎక్సైజ్ పోలీసులు 33 మందిని నిందితులుగా చేర్చారు. తాజాగా ఈ కేసులో నిందితులైన తమిళనాడుకు చెందిన గణేషన్(ఏ6), శ్రీనివాసన్ (ఏ7), సురేష్ (ఏ9), తెనాలికి చెందిన కొడాలి శ్రీనివాసరావు (ఏ12), పెద్దతిప్పసముద్రం మండలానికి చెందిన నాగరాజు (ఏ14), బెంగళూరుకు చెందిన సుదర్శన్ (ఏ20), ములకలచెరువుకు చెందిన అఫ్రఫ్ (ఏ21)లకు బెయిల్ మంజూరైంది. నాలుగు వారాల పాటు ప్రతి వారంలో ఒక రోజు తంబళ్లపల్లె కోర్టుకు వచ్చి సంతకాలు చేయాలని కోర్టు ఆదేశించింది.