Rajahmundry : సేతువాపై డేగ ఆధిపత్యం.. 1.53 కోట్ల పందెం
ABN , Publish Date - Jan 17 , 2026 | 04:01 AM
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని తోటతో గురువారం భారీ కోడి పందెం జరిగింది. గతేడాది రూ.కోటి 25 లక్షలు గెలుచుకున్న గుడివాడ ప్రభాకర్ మరోసారి కోట్ల పందెంలో నిలవగా...
రూ.1.53 కోట్లు పందెం గెలిచిన రాజమండ్రికి చెందిన రమేష్ టీం
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని తోటతో గురువారం భారీ కోడి పందెం జరిగింది. గతేడాది రూ.కోటి 25 లక్షలు గెలుచుకున్న గుడివాడ ప్రభాకర్ మరోసారి కోట్ల పందెంలో నిలవగా, ఈ సారి రాజమండ్రికి చెందిన రమేశ్ టీమ్ పందేనికి సై అన్నారు. సేతువా (పుంజు)తో గుడివాడ ప్రభాకర్ రూ.కోటి 53 లక్షలతో బరిలోకి వచ్చి కాలుదువ్వగా రాజమండ్రి రమేశ్ డేగ (పుంజు) సై అంది. ఈ పోటీలో సేతువాపై డేగ ఆధిపత్యం చూపించి సేతువాను మట్టి కరిపించింది. ఈ పోటీలో గెలిచిన రాజమండ్రి రమేశ్ టీమ్ రూ.1. 53 కోట్లు సొంతం చేసుకుంది. నిర్వాహకులు గోనె సంచిలో పందేం సొమ్ము రమేశ్ టీమ్‌కు అందించారు. భోగి రోజు రూ.63 లక్షలు, సంక్రాంతి, కనుమ రోజు రూ.45 లక్షలు రమేశ్ వర్గానికి చెందిన అమలాపురం వాసి కొవ్వురి జానకి రామరాజు గెలుచుకుని ఈ ఏడాది జరిగిన భారీ పందేలలో సత్తా చాటారు.