Share News

సర్వర్‌ డౌన..

ABN , Publish Date - Sep 09 , 2026 | 01:19 AM

కర్నూలు జీజీహెచలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఓపీ రోగులకు అవస్థలు తప్పడం లేదు.

సర్వర్‌ డౌన..
ఓపీ వద్ద బారులు తీరిన రోగుల బంధువులు

కర్నూలు జీజీహెచలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఓపీ రోగులకు అవస్థలు తప్పడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం సర్వర్‌ డౌన కావడంతో ఉదయం 9:30 గంటల నుంచి ఓపీల కోసం రోగులు క్యూ కట్టారు. సాఫ్ట్‌వేర్‌ అప్‌లోడు, పాస్‌వర్డ్‌ మార్పు కారణంగా సర్వర్‌ డౌన కావడంతో ఓపీ కౌంటర్లలో ఇబ్బందులు తలెత్తాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సిబ్బంది చేతిరాతతో ఓపీ చీటీలు రాయించి రోగులకు అందజేశారు. చేతి రాతతో ఓపీలు ఇవ్వంతో రోగులు గంటల తరబడి క్యూలైనలలో నిలబడలేక ఇబ్బందులు పడ్డారు. ఒక దశలో ఉదయం 10:30 గంటలకు రోగుల క్యూలైన రోడ్డెక్కింది. రోగుల రద్దీ ఉన్న సమయంలో ఆసుపత్రి అధికారులు పర్యవేక్షణ చేసి సమస్యను పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు.

- కర్నూలు హాస్పిటల్‌ (ఆంధ్రజ్యోతి):

Updated Date - Sep 09 , 2026 | 01:19 AM