Share News

నకిలీ మద్యం కేసులో.. సెంథిల్‌ కుమార్‌కు 19 వరకు రిమాండ్‌

ABN , Publish Date - Feb 10 , 2026 | 05:08 AM

నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుడు సెంథిల్‌ కుమార్‌కు బెజవాడ కోర్టు ఈనెల 19వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది.

నకిలీ మద్యం కేసులో.. సెంథిల్‌ కుమార్‌కు 19 వరకు రిమాండ్‌

విజయవాడ, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుడు సెంథిల్‌ కుమార్‌కు బెజవాడ కోర్టు ఈనెల 19వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది. ఇబ్రహీంపట్నంలోని నకిలీ మద్యం తయారీ కేంద్రంపై భవానీపురం ఎక్సైజ్‌ పోలీసులు నమోదు చేసిన కేసులో ఇతను ఏ22గా ఉన్నాడు. ఎక్సైజ్‌ పోలీసులు సోమవారం విజయవాడ ఆరో అదనపు జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో సెంథిల్‌ కుమార్‌ను హాజరుపరచగా 19 వరకు రిమాండ్‌ విధించారు. కాగా, నకిలీ మద్యం తయారీ కేసులో ఏ21గా ఉన్న సుదర్శన్‌ బెయిల్‌ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ ఆరో అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో సోమవారం వాదనలు పూర్తయ్యాయి. దీంతో న్యాయాధికారి జి.లెనిన్‌బాబు తీర్పును 17వ తేదీకి వాయిదా వేశారు.

Updated Date - Feb 10 , 2026 | 05:08 AM