సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మికి పోస్టింగ్
ABN , Publish Date - Jun 26 , 2026 | 03:55 AM
సీనియర్ ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మీకి ప్రభుత్వం ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చింది. సాధారణ పరిపాలన శాఖలోని జీపీఎం అండ్ ఏఆర్ విభాగంలో..
అమరావతి, జూన్ 25(ఆంధ్రజ్యోతి): సీనియర్ ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మీకి ప్రభుత్వం ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చింది. సాధారణ పరిపాలన శాఖలోని జీపీఎం అండ్ ఏఆర్ విభాగంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆమెను నియమించింది. ఈ మేరకు సీఎస్ జి.సాయిప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 30న ఆమె రిటైర్ కానున్నారు.