మే 1 నుంచి జనగణన
ABN , Publish Date - Apr 11 , 2026 | 03:11 AM
రాష్ట్రంలో 2027 జనగణనలో భాగంగా తొలిదశ గృహగణన మే 1 నుంచి మే 30 వరకు నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఈనెల 16 నుంచి సెల్ఫ్ ఎన్యుమరేషన్
అమరావతి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2027 జనగణనలో భాగంగా తొలిదశ గృహగణన మే 1 నుంచి మే 30 వరకు నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సారి జనాభా లెక్కింపును పూర్తిగా డిజిటల్ పద్ధతిలో, మొబైల్ యాప్ ద్వారా నిర్వహించనుంది. ప్రజలు తమ వివరాలు స్వయంగా నమోదు చేసుకోవడానికి సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనే సదుపాయం కల్పించింది. ఇది ఏప్రిల్ 16 నుంచి అందుబాటులోకి వచ్చి ఏప్రిల్ 30తో ముగుస్తుంది. దీని వల్ల క్షేత్రస్థాయి అధికారులపై భారం తగ్గుతుంది. ప్రజలు అధికారిక పోర్టల్ ద్వారా స్వయంగా నమోదు చేసుకోవచ్చు. ఆ పోర్టల్‌లో తమ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. మ్యాప్‌లో తమ స్థానాన్ని గుర్తించాలి. దీంతో ఒక ఐడీ జారీ అవుతుంది. ధ్రువీకరణ కోసం ఈ ఐడీని జనాభా లెక్కింపు కోసం ఇంటికి వచ్చే అధికారికి తెలియజేయాలి. ఇంటికి వచ్చి చేసే జనాభా లెక్కల ప్రక్రియలో గృహ వసతులు సహా మొత్తం 33 ప్రశ్నలు అడుగుతారు.