గురు వైభవోత్సవ అవార్డులకు ప్రముఖుల ఎన్నిక
ABN , Publish Date - Feb 07 , 2026 | 11:52 PM
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి 431 వ జయంతి, 405 వ పట్టాభిషేకం మహోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే రాఘవేంద్ర గురు వైభవోత్సవ అవార్డులకు పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో ప్రముఖులను ఎంపిక చేసినట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మఠం మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, సురేష్ కోణాపూర్, వెంకటేష్ జోషి తెలిపారు.
మంత్రాలయం, ఫిబ్రవరి7 (ఆంధ్రజ్యోతి) : మంత్రాలయం రాఘవేంద్ర స్వామి 431 వ జయంతి, 405 వ పట్టాభిషేకం మహోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే రాఘవేంద్ర గురు వైభవోత్సవ అవార్డులకు పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో ప్రముఖులను ఎంపిక చేసినట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మఠం మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, సురేష్ కోణాపూర్, వెంకటేష్ జోషి తెలిపారు. న్యాయ, ఆర్థిక, రాజకీయ, సాంకేతిక, విధ్యా, వైద్య, చిత్ర పరిశ్రమ, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య, పాండిత్యంలో విశేష ప్రతిభలను గుర్తించి గురు వైభవోత్సవ- 2026 అవార్డులకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ, కర్నాటక, తమిళనాడు హైకోర్టు జడ్జీలు జస్టిస్ హరిహరనందశర్మ, జస్టిస్ పీ. శ్రీసుధ, జస్టిస్ దండపాణి, బెంగుళూరు సిటీ సివిల్ జడ్జి సంతోష్ గజనానభట్, హైదరాబాద్ సీనియర్ అడ్వకేట్ రఘురామ్, రాష్ట్ర ఆర్ధిక శాఖమంత్రి పయ్యావుల కేశవ్, చిన్న పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత, హోం శాఖమంత్రి వంగలపూడి అనిత, కర్నాటక సివిల్ సప్లైశాఖ మంత్రికేహెచ ముణియప్ప, మాజీ డిప్యూటీ సీఎం సీఎన అశ్వత నారాయణ, బెంగుళూరు ఎంపీ పీసీ మోహన, ఎమ్మెల్యేలు కృష్ణప్ప, అరవింద్ బెల్లంద్, మాజీ టీటీడీ ఈవో అనిల్ సింఘాల్, విజయవాడ మున్సిపల్ కమిషనర్, హెచఎం ధ్యానచంద్ర, దేవదాయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన, గుంటూరు, కర్నూల్ డీఐజీలు పక్కీరప్ప కాగినెళ్లి, విక్రాంత పాటిల్, విజయనగర ఎస్‌పీ జాహ్నవి, టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, సినీ నటులు సాయికుమార్, రిషబ్‌శెట్టి, మాజీ క్రికెట్ బౌలర్, కేఎస్‌సీఏ ప్రెసిడెంట్ వెంకటేష్ ప్రసాద్, టీటీడీ ప్రధాన అర్చకులు కృష్ణ శేషాచలం దీక్షితులు, తిరుచానూర్ పద్మావతి ప్రధాన అర్చకులు శ్రీనివాస దీక్షితులు, విజయవాడ దుర్గాదేవి ప్రధాన అర్చకులు లింగంభట్ల దుర్గాప్రసాద్, బెంగుళూరు విధ్వానలు సీహెచ బద్రిఆచార్, అరలుమళ్లిగే పార్ధసారధి, భాగల్‌కోటకు చెందిన పద్మశ్రీ వెంకప్పఅంబుజి సుధటేకర్, ఉడిపి, బెంగుళూరు, రాయచూరు దాతలు జయకర్‌శెట్టి ఇంద్రాలి, మునిరాజు, హెచఎస్ రాఘవేంద్రరావు, వినయ్‌బద్రి, రామకృష్ణ, వీజీ కారణ్‌కుమార్, సెల్వి దామోదర్, ఎమ్మిగనూరు శక్తి నర్సింగ్‌హోమ్ వైద్యుడు గౌడప్పగౌడు, కేఎం నాగరాజ, అశ్వతనారాయణ, బీకే సుందర్, అజిత కులకర్ణి లను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచీ 24వ తేదీ వరకు యోగీంద్ర కళా మంటపంలో అవార్డుల ప్రదానం జరగనున్నాయి.