Share News

ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీకి ప్రతిష్ఠాత్మక బీబీఎస్‌ అవార్డులు

ABN , Publish Date - Jan 25 , 2026 | 05:27 AM

విద్యుత్‌ ఉత్పత్తిదారులలో ఒక్కటైన నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీస్‌ ఇండియా లిమిటెడ్‌కు ఫోరం...

ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీకి ప్రతిష్ఠాత్మక బీబీఎస్‌ అవార్డులు

ముత్తుకూరు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : విద్యుత్‌ ఉత్పత్తిదారులలో ఒక్కటైన నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీస్‌ ఇండియా లిమిటెడ్‌కు ఫోరం ఆఫ్‌ బిహేవియరల్‌ సేఫ్టీ నుంచి ప్రతిష్ఠాత్మక బిహేవియర్‌ బేస్డ్‌ సేఫ్టీ (బీబీఎస్‌) అవార్డులు దక్కాయి. శనివారం పూణెలో జరిగిన 10వ వార్షిక జాతీయ బీబీఎస్‌ సమావేశంలో ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌ ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ హెడ్‌ సునీల్‌కుమార్‌ గుప్తా బృందానికి ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో ప్లాటినం బెంచ్‌ మార్క్‌ అవార్డు, లాంగ్‌ టర్మ్‌ ఇంప్లిమెంటేషన్‌ సైట్‌ అవార్డు, లీడర్‌షిప్‌ అవార్డు, అబ్జర్వర్స్‌ సర్టిఫికెట్‌ అవార్డులు ఉన్నాయి. ఈ సందర్భంగా శనివారం థర్మల్‌ కేంద్రంలో ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌ సీఈవో జనమేజయ మహాపాత్ర మాట్లాడుతూ జాతీయస్థాయిలో ఈ ప్రతిష్ఠాత్మక బీబీఎస్‌ అవార్డులను అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Jan 25 , 2026 | 05:27 AM