Share News

అధునాతన టెక్నాలజీతో థర్మల్‌ విద్యుత్‌కు భరోసా

ABN , Publish Date - May 22 , 2026 | 04:51 AM

అధునాతన టెక్నాలజీతో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తికి భరోసా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. భారత థర్మల్‌ విద్యుత్‌రంగ భవిష్యత్‌పై ప్రఖ్యాత విద్యుత్‌...

అధునాతన టెక్నాలజీతో థర్మల్‌ విద్యుత్‌కు భరోసా

  • నెల్లూరులో ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీ ఆధ్వర్యంలో సీఅండ్‌ఐ కనెక్ట్‌ సదస్సు

ముత్తుకూరు, మే 21(ఆంధ్రజ్యోతి): అధునాతన టెక్నాలజీతో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తికి భరోసా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. భారత థర్మల్‌ విద్యుత్‌రంగ భవిష్యత్‌పై ప్రఖ్యాత విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీ ఇండియా గురువారం నెల్లూరులో సీఅండ్‌ఐ కనెక్ట్‌ 2026 పేరుతో ప్రత్యేక సదస్సు నిర్వహించింది. ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో కంట్రోల్‌, ఇన్‌స్ర్టుమెంటేషన్‌, ఆటోమేషన్‌పై దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ఈ సదస్సు జరిగింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి 30కిపైగా విద్యుత్‌ సంస్థలు, 150 మందికిపైగా సరఫరాదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. థర్మల్‌ విద్యుత్‌ రంగంలో అధునాతన సాంకేతికత, ఆటోమేషన్‌, సైబర్‌ భద్రతలపై చర్చించారు. ఏపీపీడీఎసీఎల్‌ డైరెక్టర్‌ (ధర్మల్‌ అండ్‌ ప్రాజెక్టు) కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ, థర్మల్‌ ప్లాంట్లు అధిక నిర్వహణ, సైబర్‌ సెక్యూరిటీ సవాళ్లు ఎదుర్కొంటున్న ఈ సమయంలో నిపుణులు నేరుగా చర్చించే ఇలాంటి వేదికలు అవసరమని అన్నారు. అనంతరం ఎస్‌ఈఐఎల్‌ సీఈవో శ్రీజనమేజయ మహాపాత్ర మాట్లాడారు.

Updated Date - May 22 , 2026 | 04:53 AM