Share News

సీమ ద్రోహి జగన్‌!

ABN , Publish Date - Jan 21 , 2026 | 04:23 AM

వైసీపీ పాలనలో ప్రాజెక్టులు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల పరిధిలోని బోరంపల్లి, ఒంటిమిద్దె, బ్రహ్మసముద్రం మండల పరిధిలోని...

సీమ ద్రోహి జగన్‌!

  • భైరవానితిప్ప కాలువ పనుల పరిశీలన

  • 2029లోపు పూర్తి చేసి.. చెరువులు నింపుతామని వెల్లడి

బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం, జనవరి 20(ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో ప్రాజెక్టులు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల పరిధిలోని బోరంపల్లి, ఒంటిమిద్దె, బ్రహ్మసముద్రం మండల పరిధిలోని పొబ్బర్లపల్లి ప్రాంతాల్లో జరుగుతున్న భైరవానితిప్ప ప్రాజెక్టు(బీటీపీ) కాలువ పనులను కల్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ పాలనలో గంపెడు మట్టి తియ్యకుండా దోచుకో, దాచుకో అన్నట్లు వ్యవహరించారని విమర్శించారు. రాయలసీమ ద్రోహిగా జగన్‌ చరిత్రలో నిలిచిపోయారన్నారు. అప్పటి మంత్రి ఉషశ్రీచరణ్‌ దందాలు, దోపిడీలకు ఈ ప్రాంతాన్ని అడ్డాగా మార్చేశారని ఆరోపించారు. కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాలకు జీవనాడి అయిన బీటీపీ గురించి ఐదేళ్ల పాలనలో జగన్‌ ఏమాత్రం పట్టించుకోలేదని అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. ఈ ప్రాంత రైతులను నట్టేట ముంచారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం బీటీపీ కాలువ పనులను ముందుకు తీసుకెళ్తుంటే ఓర్వలేక, సీమ ద్రోహులు రాజకీయ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి నాయకులను రాజకీయంగా భూస్థాపితం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 2029లోపు బీటీపీ కాలువ పనులను పూర్తి చేసి, కృష్ణాజలాలతో చెరువులను నింపుతామన్నారు. ఈ కాలువ ద్వారా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులు, రాయదుర్గం నియోజకవర్గంలోని కుడి, ఎడమ కాలువల ద్వారా 12 వేల ఎకరాలకు సాగు, తాగునీరు అందుతుందని తెలిపారు.

Updated Date - Jan 21 , 2026 | 04:39 AM