Share News

సీమలో పెరిగిన ఉష్ణోగ్రతలు.. కడపలో 34.8 డిగ్రీలు

ABN , Publish Date - Feb 05 , 2026 | 05:08 AM

కోస్తాపైకి సముద్రం మీదుగా తూర్పుగాలులు వీస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో కొనసాగుతున్న అధికపీడనం ప్రభావంతో మధ్యభారతం నుంచి పొడిగాలులు వీస్తున్నాయి.

సీమలో పెరిగిన ఉష్ణోగ్రతలు.. కడపలో 34.8 డిగ్రీలు

విశాఖపట్నం, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): కోస్తాపైకి సముద్రం మీదుగా తూర్పుగాలులు వీస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో కొనసాగుతున్న అధికపీడనం ప్రభావంతో మధ్యభారతం నుంచి పొడిగాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో కోస్తాలో ఎక్కువచోట్ల బుధవారం మేఘాలు ఆవరించాయి. రాయలసీమలో పలుచోట్ల ఆకాశం నిర్మలంగా ఉండడంతో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. కడపలో 34.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఉదయంపూట పొగమంచు కురుస్తుందని, మిగిలినచోట్ల పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Feb 05 , 2026 | 05:09 AM