సీమలో ‘బెంచ్’ ఏర్పాటు హైకోర్టులో పెండింగ్: ఫరూక్
ABN , Publish Date - Feb 21 , 2026 | 04:59 AM
రాయలసీమలో బెంచ్ ఏర్పాటు ప్రక్రియ హైకోర్టులో పెండింగ్‌లో ఉందని న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రాయలసీమలో బెంచ్ ఏర్పాటు ప్రక్రియ హైకోర్టులో పెండింగ్‌లో ఉందని న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. తన శాఖలకు బడ్జెట్‌లో కేటాయించిన రూ.1,352 కోట్లను ఆమోదించాలని ఆయన ప్రతిపాదించారు. రాష్ట్రంలో కోర్టు భవనాలు, మౌలిక సదుపాయాలు అస్తవ్యస్తంగా ఉన్నాయన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్‌కు నివేదిక అందిస్తామని చెప్పారు. కాగా హోంశాఖ, రెవెన్యూ, ఇంధన, న్యాయ, మైనార్టీ శాఖల మంత్రులు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలను సభ ఆమోదించింది.